అస్సాం, మేఘాలయలో లిక్కర్ షాపులు రీఓపెన్

అస్సాం, మేఘాలయలో లిక్కర్ షాపులు రీఓపెన్

గౌహతి: కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నా.. అస్సాం, మేఘాలయలో లిక్కర్ షాపులను రీఓపెన్ చేశారు. లిక్కర్ షాపులు, హోల్ సేల్ బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిల్లరీలు, బ్రెవరీస్ లను రోజుకు 7 గంటలపాటు తెరిచి ఉంచేందుకు రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇచ్చాయి. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని మేఘాలయలో ఉదయం 9 నుంచి సాయంత్ం 4 గంటల వరు లిక్కర్ షాపులను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే లిక్కర్ షాపుల్లో శుభ్రత పాటించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా పాటించాలని నిబంధన విధించింది. ఇప్పటికే కరోనాతో ఒకరు చనిపోగా, 29 పాజిటివ్ కేసులు నమోదైన అస్సాంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు చెప్పారు. లిక్కర్ షాపులు తక్కువ స్టాఫ్ తో రన్ చేయాలని, కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో పెట్టాలనే కండిషన్ పెట్టినట్లు తెలిపారు. ప్రజల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేఘాలయ, అస్సాం ప్రభుత్వాలు చెబుతున్నాయి. డాక్టర్ల సూచన మేరకు లిక్కర్ ను హోమ్ డెలివరీ చేస్తామని ఇటీవల కేరళ సర్కారు ప్రకటించింది. ఈ నిర్ణయంపై కేరళ హైకోర్టు స్టే విధించింది. అస్సాం, మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో లిక్కర్ కు పర్మిషన్ ఇస్తుంటే జమ్మూకాశ్మీర్ లో మాంసం, నిత్యావసర వస్తువుల షాపులకు అనుమతి ఇవ్వట్లేదని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ లోనూ లిక్కర్ సేల్ కు అనుమతించాలని ఆయన ట్వీట్ చేశారు.