తెలంగాణలో సాయంత్రం 6గంటల వరకు లాక్ డౌన్ సడలింపు

తెలంగాణలో సాయంత్రం 6గంటల వరకు లాక్ డౌన్ సడలింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు లాక్ డౌన్ ను పొడగించింది. ఇవాళ(మంగళవారం) సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జూన్ 10 నుంచి  మరో 10 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని.. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అంటే గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో ఎక్కువ కేసులున్నాయని అధికారులు రిపోర్టు ఇవ్వడంతో.. మధ్యాహ్నం వరకే లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.