విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అంగీకారం.. బీఆర్ఎస్ కూడా ప్రత్యేక తీర్మానం

విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అంగీకారం.. బీఆర్ఎస్ కూడా ప్రత్యేక తీర్మానం

కేంద్రంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అంగీకారం తెలిపారు. చర్చ సమయాన్ని కాసేపట్లో చెపుతానని వెల్లడించారు. కానీ వెంటనే చర్చ జరపాలని విపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత స‌మావేశమైన లోక్‌స‌భ‌లో.. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చకు అనుమ‌తి ఇచ్చారు  స్పీక‌ర్ ఓం బిర్లా. త్వరలో చ‌ర్చ తేదీ, స‌మ‌యాన్ని వెల్లడించనున్నట్లు సభలో ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. అవిశ్వాసంలో నెగ్గాలంటే 272 మంది ఓట్లు అవసరం. ప్రస్తుతం NDAకు 330 మంది INDIAకు 140 మంది సభ్యుల బలం ఉంది.  

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అందులో భాగంగా 26 పార్టీల ఇండియా కూటమి (INDIA) తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం పెట్టగా..బీఆర్ఎస్ తరపున ఎంపీ నామా నాగేశ్వర్ (Nama Nageshwar rao) రావు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్దతు తెలిపింది. ఈ మేరకు ఒవైసీ అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారు. ఈ తీర్మానం ద్వారా ఢిల్లీ ఆర్డినెన్సు, మణిపూర్ అంశంపై సమాధానం చెప్పించటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చూస్తున్నాయి.

ALSO READ :కేసీఆర్ ఆదేశం..మహారాష్ట్ర సర్పంచులకు వీవీఐపీ దర్శనం.. చలికి వణుకుతూ క్యూలైన్లలోనే భక్తులు

ఇండియా కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామిగా లేకపోయినా కూడా..విడిగా ఆ పార్టీ ఎంపీ నామ నాగేశ్వర్ రావు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపింది.

భారత రాజకీయ చరిత్రలో ఇది 28వ అవిశ్వాస  తీర్మానం.1963లో తొలిసారి కేంద్రంలో  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు ఇందిరాగాంధీ 15 సార్లు అవిశ్వాసాన్ని ఎదురుకున్నారు.