సుల్తానా బాద్ పట్టణంలోని రూ.9,99,999తో  వినాయకుడికి అలంకరణ

సుల్తానా బాద్ పట్టణంలోని రూ.9,99,999తో  వినాయకుడికి అలంకరణ

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని కరెన్సీతో అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రూ.9,99, 999తో మహిళలు అలంకరించిన వినాయక మండపం విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకోసం రూ.20,50,100,500 నోట్లను వినియోగించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు చకిలం మారుతి, కొమురవెల్లి రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్, శ్రీనివాస్, బాదం వాణి తదితరులు పాల్గొన్నారు.