శంషాబాద్‎లో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్ మృతి

శంషాబాద్‎లో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్ మృతి

రంగారెడ్డి: శంషాబాద్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం (మే 24) రాత్రి శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ ఆగివున్న పెట్రోలింగ్ వాహనాని ఢీకొట్టింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ధ్వంసమైంది. మృతుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.