V6 News

లీటర్ పెట్రోల్పై రూ.14, డీజిల్పై రూ.18 నష్టం.. యుద్ధంతో ఆయిల్ కంపెనీలకు భారీ లాస్‌‌

లీటర్ పెట్రోల్పై రూ.14, డీజిల్పై రూ.18 నష్టం.. యుద్ధంతో ఆయిల్ కంపెనీలకు భారీ లాస్‌‌

న్యూఢిల్లీ: క్రూడ్‌‌‌‌ ధరలు పెరగడంతో ఆయిల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ కంపెనీలు హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌, బీపీసీఎల్‌‌‌‌, ఐఓసీ  పెట్రోల్‌‌‌‌పై లీటరుకు రూ.14, డీజిల్‌‌‌‌పై రూ.18 నష్టపోతున్నాయి. రిటైల్‌‌‌‌ ధరల్లో మార్పులేకపోవడంతో ఈ కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి.  పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌తో పాటు ఎల్‌‌‌‌పీజీలో కూడా భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. 

రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంటగ్యాస్‌‌‌‌పై రూ.80 వేల కోట్ల వరకు అండర్‌‌‌‌ రికవరీ (నష్టం) ఉండొచ్చని అంచనా. ఎరువుల సబ్సిడీ కూడా రూ.2.05–2.25 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌‌‌‌లో రూ.1.71 లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించింది.  హార్మూజ్‌‌‌‌ సముద్ర మార్గం మూతపడడంతో ఇంధనాలు, ఎరువులు, కెమికల్స్‌‌‌‌ సరఫరా కష్టమై ధరలు పెరిగాయి. 

సంక్షోభానికి ముందు క్రూడ్‌‌‌‌ ధరలు బ్యారెల్‌‌‌‌కు  70–72 డాలర్లు ఉండగా, ఇప్పుడు  120–125 డాలర్లకి చేరాయి.   యూరియా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.   సిటీ గ్యాస్‌‌‌‌ డిస్ట్రిబ్యూటర్లు కూడా గ్యాస్‌‌‌‌ ధరలు, రూపాయి విలువ తగ్గుదల వల్ల మార్జిన్‌‌‌‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.