లవ్ ఫెయిల్: వాట్సాప్ లో స్టేటస్ పెట్టి.. యువకుడు ఆత్మహత్యాయత్నం

లవ్ ఫెయిల్: వాట్సాప్ లో స్టేటస్ పెట్టి.. యువకుడు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు ఇక దక్కదని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. ప్రేమించిన ప్రియురాలితో పెళ్లికి కులం అడ్డు రావడంతో.. తల్లిదండ్రులను వదిలిరాలేనని యువతి తేల్చి చెప్పింది. దీంతో తన ప్రేమ విఫలమైందని మనస్థాపంతో యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన మొబైల్ లోని వాట్సాప్ లో చనిపోతున్నట్లు స్టేటస్ పోస్ట్ పెట్టాడు. తర్వాత పురుగుల మందు తాగాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లాలో జరిగింది.

అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, బూదగవి కొండ గ్రామానికి చెందిన బెస్త సుధాకర్.. అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  కులం చూడకుండా ఎవరిని ప్రేమించవద్దని, పెళ్లికి ఒప్పుకోరని చెబుతూ.. పురుగుల మందు తాగిన వీడియోను వాట్సప్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు. వాట్సప్ స్టేటస్ చూసిన సుధాకర్ ఫ్రెండ్స్ వెంటనే ఉరవకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. అయితే సుధాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యుల సూచనల మేరకు అనంతపురం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.