వరంగల్ ఏకేతండాలో అమానుష ఘటన.. యువతిపై గ్యాంగ్‌ రేప్‌.. బాధితురాలు మృతి !

వరంగల్ ఏకేతండాలో అమానుష ఘటన.. యువతిపై గ్యాంగ్‌ రేప్‌.. బాధితురాలు మృతి !

వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. గంజాయి మత్తులో నలుగురు యువకులు సదరు యువతిపై గ్యాంగ్ రేప్కు పాల్పడి చంపేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు వర్ధన్నపేట వద్ద వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అమాయకురాలైన యువతిని కిడ్నాప్ చేసి ఆపై గ్యాంగ్ రేప్నకు పాల్పడి హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

నిందితులను శిక్షించే దాకా పోస్టుమార్టం చేసేది లేదంటూ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో వర్ధన్నపేట మార్చురీ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయపర్తి మండలం ఏకే తండాలో జరిగిన ఈ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.