కలిసిపోయిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఫ్యామిలీస్.. పెళ్లి బాజాలు మోగనున్నాయా..?

కలిసిపోయిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఫ్యామిలీస్.. పెళ్లి బాజాలు మోగనున్నాయా..?

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ కుటుంబాల మధ్య గొడవలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ మళ్లీ కలిసిపోయారని.. వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు సాక్ష్యం అని నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. ఈ రెండు కుటుంబాలు గతం గత: అని రాజీ బాటలో నడుస్తున్నాయనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. స్మృతి మంధాన కుటుంబం.. మరీ ముఖ్యంగా ఆమె తండ్రి.. పలాష్ ముచ్చల్ సోదరితో ఆప్యాయంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. పలాష్ సోదరి పలక్ గౌరవంగా స్మృతి మంధాన తండ్రి కాళ్లకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియో అది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుటుంబాల మధ్య బంధాలు తిరిగి చిగురించాయనడానికి ఈ వీడియోనే సంకేతం అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన స్మృతి మంధాన అభిమానులు ఆమె ప్రేమ మళ్లీ పెళ్లి వైపుగా అడుగులేస్తుందని ఆశించారు. దీంతో.. ఈ రెండు కుటుంబాలు జరిగిందంతా మర్చిపోయి మళ్లీ కలిసిపోయాయనే ప్రచారం ఊపందుకుంది. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ మధ్య చిగురించిన ప్రేమ.. పలాష్ ముచ్చల్ ఫొటోలు, చాట్లు బయటకు రావడంతో పెళ్లి వరకూ వెళ్లకుండా మధ్యలోనే బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.

2025 నవంబర్ 23నే స్మృతి, పలాష్ పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక్క రోజు ముందు ఈ పెళ్లి రద్దయింది. ఈ ఇద్దరి పెళ్లి రద్దయిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు స్మృతి తండ్రి కాళ్లకు పలాష్ సోదరి నమస్కరిస్తున్న వీడియో వైరల్ కావడం గమనార్హం. 

►ALSO READ | DC vs GT: గిల్, బట్లర్ వీర బాదుడు.. సుందర్ ఉతుకుడు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

పెళ్లి రద్దు కావడం స్మృతి మంధానను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో.. మంధాన, ముచ్చల్ ఇద్దరూ తాము విడిపోయినట్లు ధృవీకరించారు. అయితే.. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని మీడియాను, సోషల్ మీడియాను కోరారు. అయితే.. మళ్లీ కొన్ని నెలల తర్వాత స్మృతి, ముచ్చల్ మళ్లీ పెళ్లి దిశగా అడుగులేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. స్మృతి గానీ, ముచ్చల్ గానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.