DC vs GT: గిల్, బట్లర్ వీర బాదుడు.. సుందర్ ఉతుకుడు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

DC vs GT: గిల్, బట్లర్ వీర బాదుడు.. సుందర్ ఉతుకుడు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

గుజరాత్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు నిర్దేశించింది. గుజరాత్ జట్టు కెప్టెన్ గిల్ 5 సిక్సులు, 4 ఫోర్లతో  70 పరుగులతో అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకుని కమ్ బ్యాక్ ఇచ్చిన గిల్.. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని నిరూపించాడు.

గిల్కు తోడు జోస్ బట్లర్ కూడా 5 సిక్సులు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు మాత్రమే కాదు.. వాషింగ్టన్ సుందర్ కూడా 55 పరుగులు చేసి జట్టు 200 స్కోర్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు. గ్లెన్ ఫిలిప్స్ 14 పరుగులు, రాహుల్ తెవాటియా ఒక పరుగుతో నాటౌట్గా నిలిచారు.

బ్యాటింగ్లో గుజరాత్ అద్భుతంగా రాణించింది. బౌలింగ్లో కూడా రాణిస్తే ఢిల్లీకి ఎదురుదెబ్బ తప్పదు. అయితే.. ఢిల్లీ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. లక్నో, ముంబై జట్లను ఓడించి ఢిల్లీ మంచి జోరు మీద ఉంది. అయితే.. ఈ మ్యాచ్లో 210 పరుగుల టార్గెట్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఛేజింగ్ చేసి గెలవాల్సి ఉంది. ఇక.. గుజరాత్ బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్, సిరాజ్, రబడ.. ఈ ముగ్గురూ బౌలింగ్లో రాణిస్తేనే గుజరాత్ జట్టు చేసిన అంత భారీ స్కోర్కు అర్థం ఉంటుంది.