బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ వారం భారీ వర్షాలు

 బంగాళాఖాతంలో అల్పపీడనం..  ఈ వారం భారీ వర్షాలు

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వానలు పడే చాన్సుందని చెప్పింది. 

ఇవాళ, రేపు పది జిల్లాలు.. గురు, శుక్రవారాల్లో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంది. హైదరాబాద్ లోనూ 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.