శంషాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్కు వస్తున్న లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు
  • గమ్యం చేరుకోకుండానే తిరిగి ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు

శంషాబాద్, వెలుగు: జర్మనీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. శంషాబాద్​ఎయిర్ పోర్టుకు వస్తున్న లుఫ్తాన్సా విమానానికి ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. లుఫ్తాన్సా ఎయిర్​లైన్స్ ( ఎల్ హెచ్752) విమానంలో బాంబు ఉందంటూ ఆదివారం సాయంత్రం ఆగంతకులు ఎయిర్ పోర్టుకు ఈమెయిల్ పంపించారు.

 దీంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. లుఫ్తాన్సా విమానాన్ని శంషాబాద్ కు చేరుకోనీయకుండానే తిరిగి ఫ్రాంక్ ఫర్ట్ కు మళ్లించారు.