పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి పునర్జన్మనిచ్చేందుకు గంటన్నరలోనే బెంగళూరు టు సికింద్రాబాద్‌కు గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తులను తరలించారు. బెంగళూరులోని ఆస్టర్ హాస్పిటల్లో సేకరించిన లంగ్స్‌ను తీసుకుని స్టార్ ఎయిర్‌లైన్స్ విమానం మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరింది.
ఆ విమానం 2:20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ‘గ్రీన్ చానల్’ఏర్పాటు చేశారు. ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కేవలం 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ను ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్టర్ల బృందం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ను పూర్తి చేసి పేషెంట్ ప్రాణాలను కాపాడారు.
