‘మళ్లీ పెళ్లి’ నుంచి లిరికల్ సాంగ్‌‌‌‌ రిలీజ్

‘మళ్లీ పెళ్లి’ నుంచి లిరికల్ సాంగ్‌‌‌‌ రిలీజ్

నరేష్, పవిత్ర లోకేష్  జంటగా ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘మళ్లీ పెళ్లి’.  విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నరేష్​ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్.. తాజాగా లిరికల్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేసింది.  ‘ఉరిమే కాలమా..ఉరికే దాపుమా.. బదులీ.. ఒకటే ప్రాణమై’ అంటూ సాగే పాటలో నరేష్​, పవిత్ర జోడీ ఆకట్టుకుంటుంది.

సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశాడు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌‌‌‌గా పాడాడు. ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో జయసుధ, శరత్‌‌‌‌బాబు, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.