హైదరాబాద్, వెలుగు: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. సోమయ్య (నల్లగొండ), ప్రధాన కార్యదర్శిగా టి. లింగారెడ్డి (హనుమకొండ) ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో రెండ్రోజుల పాటు జరిగిన డీటీఎఫ్ 16వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ముగిశాయి.
ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వి. రాజిరెడ్డి, టి. శ్రీశైలం, చాపబాబు, పి. సృజన, పి. దాసు ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ఎం. సామ్యూల్, జె. రామస్వామి, ఎ. శ్రీనివాసరెడ్డి, బి. శ్యామ్, ఆర్. లింగయ్య ఎన్నికయ్యారు. సంఘం పత్రిక అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడిగా డాక్టర్ ఎం. గంగాధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బి. సదానందం ఎన్నికైనట్టు ప్రకటించారు. టీచర్ల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణ కోసం కొత్త కమిటీ పనిచేస్తుందని నేతలు ప్రకటించారు.
