
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆడించిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది? ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటనతో ఏమేరకు ఆకట్టుకున్నాడు? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: రీజీనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, అందులోని స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ కాలేజ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు.. అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), లడ్డు. ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అశోక్ ఏమో ఇంట్రావర్ట్, మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక డీడీ ఏమో.. అమ్మాయిలే వద్దని సోలో లైపే బెటర్ అని ఫిక్స్ అయిపోతాడు. ఆలాంటి వాళ్ళ లైఫ్ లోకి.. జెన్నీ(అనంతిక సనీల్ కుమార్), శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి) ఎంటర్ అవుతారు. ఆ తరువాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? కాలేజ్ లో ఈ మ్యాడ్ గ్యాంగ్ చేసిన అల్లరేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: కాలేజ్, స్టూడెంట్స్, వాళ్ళు చేసే అల్లరి, ప్రేమ.. ఈ కాన్సెప్ట్ తో ఇప్పటికి సినిమాలే వచ్చాయి, మ్యాడ్ సినిమా కూడా అలాంటిదే. కథగా చూసుకుంటే పెద్దగా ఎం ఉండదు కానీ.. సీన్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్, సీనియర్లతో గొడవలు, పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ చాలా సినిమాలో చూసినవే కానీ.. మ్యాడ్ సినిమాలో చూపించిన కొత్తదనం ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. అక్కడక్కడా డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ ఈ వెబ్ సిరీస్ ల జమానాలో పెద్దగా పట్టవు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా సినిమా అంతా ఫుల్ ఆన్ ఫన్ రైడ్ లా ఉంటుంది. కానీ ఎమోషన్స్ పార్టీ పెద్దగా అతికినట్టుగా అనిపించదు. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా కావాలని పెట్టినట్టుగా ఉంటుంది.
నటీనటులు: మ్యాడ్ సినిమాలో కనిపించిన వారంతా చాలా వరకు కొత్తవాళ్లే. దాని వల్లే సినిమా చాలా సహజంగా కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మొదటి సినిమా అయినా నటనతో ఆకట్టుకున్నాడు. పాత్ర మేరకు మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ కూడా తనదైన టైమింగ్‌తో పిచ్చెకించాడు. సినిమాలో మనోడి పాత్ర చాలా కామెడీ గా ఉంటుంది. లవర్‌బాయ్ మనోజ్‌గా రామ్ నితిన్ అదరగొట్టేశాడు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల మేరకు నటించారు. ఇక లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు మెప్పిస్తాడు.
సాంకేతిక నిపుణులు: మ్యాడ్ సినిమాకు భీమ్స్ అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకొల్లాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ఇక మొత్తంగా చెప్పాలంటే.. మ్యాడ్ మూవీ ఫుల్ ఆన్ ఫన్ రైడ్. కామెడీ సూపర్ గా వర్కౌట్ అయ్యింది. ఏ వీకెండ్ ఫుల్ గా ఎంటర్టైన్ అవ్వొచ్చు.