Killer First Glimpse: హీరోగా మారిన టాలీవుడ్ డైరెక్టర్.. సైన్స్‌‌ ఫిక్షన్ థ్రిల్లర్గా గ్లింప్స్

Killer First Glimpse: హీరోగా మారిన టాలీవుడ్ డైరెక్టర్.. సైన్స్‌‌ ఫిక్షన్ థ్రిల్లర్గా గ్లింప్స్

పూర్వజ్‌‌ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌‌‌‌’.జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌‌.  ఇదొక సైన్స్‌‌ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. బుధవారం ఈ మూవీ గ్లింప్స్ను తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో లాంటి ఎలిమెంట్స్‌‌తో కట్ చేసిన టీజర్‌‌‌‌ సినిమాపై ఆసక్తి రేపింది.

సూపర్ షీ క్యారెక్టర్‌‌‌‌లో నటించిన జ్యోతి.. యాక్షన్‌‌ సీన్స్‌‌తో ఆకట్టుకుంది. ‘మొదలెడదామా’అంటూ టీజర్ చివర్లో పూర్వజ్‌‌ కనిపించాడు. లవ్, రొమాన్స్, రివెంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో దీన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.  విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  ఏయు అండ్ఐ, మెర్జ్ఎక్స్‌‌ఆర్, థింక్ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.  

అయితే, ఇటీవల జ్యోతి రాయ్ తన పేరును జ్యోతి పూర్వాజ్‌గా మార్చుకున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటున్నారు జ్యోతి పూర్వాజ్. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకున్నాడు దర్శకుడు పూర్వాజ్.