బాస్కెట్ బాల్ ప్లేయర్తో అసభ్య ప్రవర్తన.. అసోసియేషన్ జనరల్సెక్రటరీపై పోక్సో కేసు

బాస్కెట్ బాల్ ప్లేయర్తో అసభ్య ప్రవర్తన..  అసోసియేషన్ జనరల్సెక్రటరీపై పోక్సో కేసు

మాదాపూర్, వెలుగు: మైనర్ బాస్కెట్‌‌‌‌ బాల్ ప్లేయర్​ను లైంగికంగా వేధించిన ఆరోపణలపై బాస్కెట్‌‌‌‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వేశ్వర్‌‌‌‌రెడ్డిపై మాదాపూర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత బాలిక బాస్కెట్‌‌‌‌బాల్ క్రీడాకారిణిగా వివిధ పోటీల్లో పాల్గొంటోంది. 

జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, మాదాపూర్‌‌‌‌లోని డీబీఏ బాస్కెట్‌‌‌‌బాల్ అకాడమీలో నిర్వహించిన పోటీల సందర్భంగా పృథ్వేశ్వర్‌‌‌‌రెడ్డి పలుమార్లు అసభ్య సైగలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలిక రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసి కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌కు బదిలీ చేశారు. అనంతరం మాదాపూర్ పోలీసులు పృథ్వేశ్వర్‌‌‌‌రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.