కర్తవ్య పథ్‌లో దేశీయ ఆయుధాలు

కర్తవ్య పథ్‌లో దేశీయ ఆయుధాలు

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మొదటిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్‌’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కవాతు విజయ్‌చౌక్‌ వద్ద మొదలై ఎర్రకోట వరకు సాగుతుండగా..  దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

1.  అర్జున్‌ ట్యాంకులు -- కెప్టెన్‌ అమన్‌జీత్‌ 

 

2. నాగ్ మిస్సైల్ సిస్టమ్- లెఫ్టినెంట్ సిద్ధార్థ త్యాగి 

 

3. బీఎంపీ-2 వాహనాలు- కెప్టెన్‌ అర్జున్‌ సిద్ధూ 

 

4. లద్దాఖ్‌ స్కౌట్‌ రెజిమెంట్‌కు చెందిన క్విక్‌ రియాక్షన్‌ పోరాట వాహనాలు- కెప్టెన్‌ నవీన్‌ దత్తేర్వాల్‌

 

5.  K--9 వజ్ర- - T ట్యాంకులు - లెఫ్టినెంట్‌ ప్రఖర్‌ తివారీ 

 

6. బ్రహ్మోస్‌-816 రెజిమెంట్‌- లెఫ్టినెంట్‌ ప్రజ్వల్‌ కాల 

 

7. 64 అసాల్ట్‌ ఇంజినీర్‌ రెజిమెంట్‌కు చెందిన 10 మీటర్ల షార్ట్‌ స్పాన్‌ బ్రిడ్జ్‌ వాహనాలు- కెప్టెన్‌ శివశీష్‌ సోలంకి

 

8. 2 ఏహెచ్‌క్యూ సిగ్నల్‌ రెజిమెంట్‌కు చెందిన ‘మొబైల్‌ మైక్రోవేవ్‌ నోడ్‌ అండ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ సెంటర్‌’ - మేజర్‌ మొహిద్‌ ఆసిఫ్‌ అహ్మద్‌