తన క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసిన కన్నడ బ్యూటీ ప్రియాంకా మోహన్.. ఇప్పుడు రూట్ మార్చింది. లోకల్ నుంచి గ్లోబల్ లెవెల్‌కు రేంజ్ పెంచేస్తూ ఇంటర్నేషనల్ వేదికలపై రచ్చ లేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'మేడ్ ఇన్ కొరియా' (Made In Korea) ఇండో-కొరియన్ డ్రామాలో 'షెణ్బ'గా ప్రియాంక చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్ గ్లోబల్ హిట్‌తో ఆమె క్రేజ్ ఒక్కసారి రాకెట్‌లా దూసుకెళ్లింది. రీసెంట్‌గా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ లీ జే-మ్యుంగ్ కోసం ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ స్టేట్ బ్యాంక్వెట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
అక్కడితో ఈ భామ హవా ఆగలేదు.. ఇప్పుడు ఏకంగా సౌత్ కొరియాలోనే ల్యాండ్ అయిపోయింది. ప్రియాంకకున్న విపరీతమైన స్టార్ పవర్‌ను గుర్తించిన కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO), ఆమెను తమ 'గౌరవ పర్యాటక రాయబారి' (Honorary Ambassador of Korea Tourism) గా అధికారికంగా నియమించింది. కొరియా టూరిజం, సంస్కృతిని భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు, ఇండియన్ పర్యాటకులను ఇన్‌స్పైర్ చేసేందుకు ఈ క్రేజీ కొల్లాబరేషన్ సెట్ చేశారు.
ఈ గుడ్ న్యూస్‌ను ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బ్లాక్ డ్రెస్, టైలర్డ్ బ్లేజర్‌లో అదిరిపోయే లుక్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 'ఈ అరుదైన గౌరవానికి చేతులెత్తి మొక్కుతున్నా. నాపై నమ్మకం ఉంచిన కొరియా ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం కొరియా అందాలను ఆస్వాదిస్తున్న ఈ బ్యూటీ, త్వరలోనే ఇండియాకు రిటర్న్ కానుంది.
కేవలం అంబాసిడర్ పదవులే కాదు.. ప్రియాంక నెక్స్ట్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు సరసన 'అరసన్' లో నటిస్తుంది. యంగ్ స్టార్ కవిన్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'మంజనత్తి. ఇందులో ప్రియాంక టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, లెజెండరీ ఇసైజ్ఞాని ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఒక వైపు గ్లోబల్ సక్సెస్ తో పాటు, చేతిలో బడా ప్రాజెక్టులతో ప్రియాంకా మోహన్ బాక్సాఫీస్ వద్ద 'క్వీన్' లా దూసుకుపోవడం ఖాయంగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
