టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే:మురళీధర్ రావు

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే:మురళీధర్ రావు

అవినీతి పరులపై కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్యవర్గ సమావేశంలో మురళీధర్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. 


రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి బీజేపీకి కంచుకోటలుగా మారాయన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని కోరారు.రాష్ట్రంపై కేంద్రం స్పష్టమైన అవగాహనతో ఉందన్నారు మురళీధర్ రావు. టీఆర్ఎస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.దేశంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పై స్పష్టమైన ప్రణాళికతో ఉందని తెలిపారు.