పీఎం యువ 3.0కు సాయికిరణ్ ఎంపిక

పీఎం యువ 3.0కు సాయికిరణ్ ఎంపిక

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన యువ కవి, రచయిత కానుకుర్తి సాయికిరణ్ కు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం, విద్యా శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించిన పీఎం యువ 3. 0(యువ రచయితల శిక్షణ)కు సాయికిరణ్  రాసిన వ్యాసం ఎంపికైంది. దేశంలో 50 మందిని మాత్రమే ఎంపిక చేయగా, ఈ పోటీలో జిల్లా నుంచి సాయికిరణ్ ఎంపిక కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయికిరణ్ ను కవులు, రచయితలు అభినందించారు.