Mahesh Babu : రిలాక్స్ మోడ్‌లో 'వారణాసి' టీమ్.. ఏఎంబీ సినిమాస్‌లో మహేష్, ప్రియాంక, నిక్ సందడి!

Mahesh Babu : రిలాక్స్ మోడ్‌లో 'వారణాసి' టీమ్.. ఏఎంబీ సినిమాస్‌లో మహేష్, ప్రియాంక, నిక్ సందడి!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశ విదేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ కొనసాగుతుండగా.. షూటింగ్ విరామంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కలిసి మూవీ నైట్‌కు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లో ఈ ముగ్గురు కలిసి సినిమా వీక్షించిన ఫోటో వైరల్ అవుతోంది. ఏఎంబీ సినిమాస్ అధికారికంగా షేర్ చేసిన ఈ ఫోటోకు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అంతేకాదు, పోస్టులో చివరలో జోడించిన '7' ఎమోజీ కూడా నెటిజన్లలో కొత్త చర్చకు దారితీసింది. ఇది 'వారణాసి' రిలీజ్ డేట్‌కు సంబంధించిన హింటా? లేక మరో స్పెషల్ అప్‌డేట్‌కు సంకేతమా? అంటూ ఫ్యాన్స్ ఊహాగానాలు మొదలుపెట్టారు.

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' చిత్రాన్ని ఈ ముగ్గురు కలిసి వీక్షించినట్లు సమాచారం.. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ స్టార్స్ కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఈ మూవీ నైట్ ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. లాంజ్‌లో ముగ్గురూ సరదాగా ముచ్చటిస్తూ గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక 'వారణాసి' విషయానికి వస్తే.. దాదాపు వెయ్యి కోట్లకు పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు 'రుద్ర' పాత్రలో, ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో డబుల్ షేడ్స్ ఉన్న శక్తివంతమైన క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రియాంక ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన లభించగా.. మహేష్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం లుక్ సినిమాపై మరింత హైప్ పెంచింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ మెగా ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ALSO READ : అక్కినేని ఫ్యాన్స్ కల నెరవేరింది.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘లెనిన్’..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AMB Cinemas (@amb_cinemas)