కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జీళ్లచెరువులో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎంపీ రఘురాంరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుండా మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని, రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
