ధర్మసాగర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోళ్లు షురూ

ధర్మసాగర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోళ్లు షురూ

ధర్మసాగర్/ ఖమ్మం రూరల్, వెలుగు: మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండల కేంద్రంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఆయన 13 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 43 మంది సీఎంఆర్ఎఫ్​లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మక్కల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి మార్కెట్​ యార్డులో మార్క్​ఫెడ్​ సౌజన్యంతో ఏదులాపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మద్దులపల్లి మార్కెట్​ కమిటీ చైర్మన్​ హరినాథ్​బాబు ప్రారంభించారు. ​