అవినీతి, అక్రమాలపై మజ్లిస్‌‌‌‌‌‌‌‌ పోరాటం: అసదుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ

అవినీతి, అక్రమాలపై మజ్లిస్‌‌‌‌‌‌‌‌ పోరాటం: అసదుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ

షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అక్రమాలపై పోరాటం చేస్తూ అన్యాయాలకు గురవుతున్న సామాన్యుడికి మజ్లిస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అండగా ఉంటుందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ అన్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలోని ఒకటో వార్డు ఏఐఎంఐఎం అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించేది ఒక్క మజ్లిస్‌‌‌‌‌‌‌‌ పార్టీయేనన్నారు. షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఒకటో వార్డు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఏఐఎంఐఎం బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.