
వర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా 'మేజర్' చిత్ర విశేషాలను కథానాయిక సయీ మంజ్రేకర్ మీడియాతో పంచుకున్నారు
'మేజర్' చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
మేజర్ చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తా. మేజర్ సందీప్‌కి చిన్ననాటి ప్రేమికురాలిగా, భార్యగా కనిపిస్తా. చిన్ననాటి సన్నివేశాల్లో చాలా ప్యూరిటీ ఉంటుంది. ఒక సాధారణ కుర్రాడు అసాధారణ పనులు ఎలా చేశారన్నది మేజర్‌లో చూస్తారు. నాది నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్ర. ఫస్ట్ డే షూటింగ్లో చాలా కంగారు పడ్డా. తెలుగు అర్ధమేయ్యేది కాదు. ఫస్ట్ షెడ్యుల్ పూర్తైన తర్వాత కాన్ఫిడెన్స్ ఎంతగా పెరిగిందంటే నా పాత్రకి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చెప్పా.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చేయడం ఎలా అనిపించింది?
మహేష్ బాబు నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేశా. సల్మాన్ ఖాన్, అల్లు బాబీ, ఇప్పుడు మహేష్ బాబు గారి నిర్మాణంలో చేశా. కెరీర్ బిగినింగ్‌లోనే పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా.
మేజర్ సందీప్ తల్లిదండ్రులని కలిశారా?
తాజ్‌లో జరిగిన మేజర్ సందీప్ స్మారక కార్యక్రమంలో ఒకసారి ఆయన పేరెంట్స్‌ని కలిశాను. ఈ మధ్యనే బెంగళూర్‌లో జరిగిన మేజర్ ప్రివ్యూలో మళ్ళీ కలిశాను. చాలా గొప్ప వ్యక్తులు. మేజర్ సందీప్ తల్లిని చూస్తే నా మదర్ని చూసినట్లే అనిపించింది. గొప్ప ప్రేమ, ఆప్యాయత వున్న వ్యక్తులు వాళ్లు.
మేజర్ చూసిన తర్వాత సందీప్ తల్లితండ్రుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
మేజర్ సినిమా గురించి మేజర్ సందీప్ కజిన్ ఒకరు ఇన్‌స్టాలో స్టొరీ పోస్ట్ చేశారు. అందులో నా పనితీరు సందీప్ తల్లి ధనలక్ష్మీ గారికి చాలా నచ్చిందని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. నా పనితీరు వారికి నచ్చింది. ఇంతకంటే ఏం కోరుకోను.
కథ ప్రకారం మీరు సందీప్‌కి ప్రపోజ్ చేస్తారా? సందీప్ మీకు ప్రపోజ్ చేస్తారా?
ఇద్దరూ.( నవ్వుతూ) చాలా క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టొరీ అది.
మేజర్‌లో మీ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా వుంటుంది?
ఇషా పాత్రని పోషించడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్రకు మంచి గ్రాఫ్ వుంటుంది. 16 ఏళ్ల స్కూల్ గర్ల్‌గా, సందీప్ భార్యగా, ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తా. ఒకే సినిమాలో ఇన్ని కోణాలు వుండే పాత్ర దక్కడం అదృష్టం. మేజర్ చిత్రంతో చాలా అంశాలు నేర్చుకున్నా.
మేజర్ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
నమ్రత మేడమ్ మా పేరెంట్స్‌కి తెలుసు. ఆమె కాల్ చేసి మేజర్‌లో రోల్ గురించి అమ్మకి చెప్పారు. మా నాన్నగారు ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని చెప్పారు. తర్వాత శేష్ ను కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్ల ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం.
మేజర్ సినిమాలో మీకు నచ్చిన పాత్ర ?
మేజర్ సందీప్ రియల్ హీరో. ఆయన పాత్ర అందరికీ నచ్చుతుంది. మేజర్ సందీప్ తల్లి పాత్ర చేసిన రేవతికి ఫిదా అయిపోయా. ఆమె అద్భుతంగా చేశారు. 'మేజర్' సినిమాకి మేజర్ సందీప్ ఆత్మలాంటి వారైతే ఆయన తల్లి ధనలక్ష్మీ పాత్ర పోషించిన రేవతి సందీప్ కి ఆత్మలాంటి పాత్ర. చాలా గొప్పగా ఉంటుంది.
మేజర్‌లో మీ పాత్రని ఎలా అవగాహన చేసుకున్నారు?
మేజర్ సెట్స్‌కి వెళ్ళినపుడు సీరియస్‌గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అనే దానిపై నాకు అవగాహన లేదు. మొదటి సీన్ పూర్తైన తర్వాత అందరూ ఆనందంగా నవ్వారు. మేజర్ సందీప్ జీవితం చాలా అందమైనది. ఇషా పాత్రకి తగ్గట్టుగా సెట్స్‌లో నా మూడ్ స్వింగ్స్ ఉండేవి.
అడవి శేష్‌తో పని చేయడం ఎలా అనిపించింది?
అడవి శేష్ గ్రేట్ డెడికేషన్ ఉన్న పర్సన్. అన్ని విషయాల్లో సాయం చేస్తారు. ఎన్ని ప్రశ్నలడిగినా ఎలాంటి విసుగు లేకుండా కూల్‌గా సమాధానం ఇస్తారు. చాలా మంచి విషయాలు చెబుతుంటారు. ఆయన ఫ్రాంక్‌లు కూడా చేస్తారు ( నవ్వుతూ) నాకు బల్లులు అంటే భయం. చాలా అందంగా ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేస్తే అందులో రెండు బల్లులు వున్నాయి( నవ్వుతూ).
శోభితా ధూళిపాళ్లతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
లేదు. కానీ మా ఇద్దరి పాత్రలు కథలో చాలా కీలకం. షూటింగ్లో ఆమెను కలిశాను. చాలా స్వీట్ పర్సన్.
దర్శకుడు శశి కిరణ్ తిక్కా తో పని చేయడం ఎలా అనిపించింది?
శశి చాలా కూల్‌గా వుంటారు. ఆయన విజన్ చాలా క్లియర్. మేజర్ షూటింగ్ సమయంలోనే శశి ఫాదర్ చనిపోయారు. అయినా ఆయన ఎంతో ధైర్యంగా సెట్స్‌కి వచ్చారు. శశి చాలా అద్భుతమైన డైరెక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది.
మేజర్‌లో మీకు సవాల్‌గా అనిపించిన అంశం ఏది?
తెలుగు భాష విషయంలో కాస్త భయపడ్డా. క్రమంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. ఆ సమస్యని అధిగమించి స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా వుంది. అలాగే ఇది మేజర్ సందీప్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం. కచ్చితంగా మాపై బాధ్యత ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా లెక్కలోకి వస్తుంది. ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని సినిమా చేయడం కూడా ఒక సవాలే.
మీ పాత్ర తెలుగులో డబ్బింగ్ చెప్పారు కదా.. తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది?
తెలుగు వెర్షన్ వైజాగ్‌లో చూశా. అసలు డబ్బింగ్ చెప్పింది నేనేనా అని నమ్మలేకపోయా. చాలా రోజుల క్రితమే డబ్బింగ్ పూర్తి చేశాను. మాట పలకడం, డిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఒక్కసారిగా తెరపై చూసేసరికి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. చిత్ర యూనిట్‌తో పాటు మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇకపై డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా.
తెలుగులో రెండు సినిమాలు చేశారు కదా.. టాలీవుడ్ ఎలా అనిపించింది?
తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ అంతా చాలా ఆప్యాయంగా వుంటారు. అందరూ డెడికేట్‌గా వర్క్ చేస్తారు. చాలా కష్టపడతారు. హైదరాబాద్ కల్చర్ నాకు చాలా నచ్చింది.
మీ నాన్న తెలుగులో అందరికీ తెలుసు. మీరు తెలుగు సినిమా చేస్తున్నపుడు సలహాలు ఏమైనా ఇచ్చారా?
డైలాగ్స్ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు. తెలుగు మాటని హిందీలో ఒత్తులు, దీర్ఘాలతో సహా సరిగ్గా రాసుకొని పలకమనే వారు. ఇది తెలుగు సరిగ్గా పలకడానికి సహకరించింది.
లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉందా?
ఉంది. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాను. ఇంకా డిఫరెంట్ సినిమాలు పాత్రలు చేయాలని వుంది.
మీ కొత్త సినిమాలు?
కొన్ని కథలు విన్నాను. హిందీలో ఓ సినిమా చేస్తున్నా. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది.
ఆల్ ది బెస్ట్
థ్యాంక్ యూ