"మేజర్" పాటకు విశేష స్పందన

"మేజర్" పాటకు విశేష స్పందన

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న యంగ్ హీరో అడవిశేష్  తాజాగా నటించిన మేజర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దేశభక్తి కలిగిన సోల్జర్ గా ఉద్వోగ సన్నివేశాలు గల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. గతంలో విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన రావడంతో సినీ ప్రేక్షకులు మూవీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళంలోనూ రాబోతున్న ఈ సినిమాను మహేశ్ బాబు యొక్క జీఎంబీ ఎంటర్ టైన్మంట్ ఏప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్ ఫిల్మ్ ఇండియా నిర్మించింది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా...  కరోనా కారణంగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. మేజర్ సినిమాలోని హృదయమా అనే సాంగ్ ను కళాశాల విద్యార్థులతో కలిసి మూవీ మేకర్స్   పూణెలో  రిలీజ్ చేశారు. సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు మాంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఇకపోతే ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. కానీ ఓమైక్రాన్ .. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేశారు. ఆ  తర్వాత మళ్లీ  మే 27న విడుదల  కానున్నట్టు ప్రకటించినా..  చివరకు జూన్ 3న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నట్టు తెలుస్తోంది.

 

 

 

 

మరిన్ని వార్తల కోసం....

రాజస్థాన్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా..

జైలులో భోజనం.. ఎప్పుడైనా తిన్నారా ?