జైలులో భోజనం.. ఎప్పుడైనా తిన్నారా ?

జైలులో భోజనం.. ఎప్పుడైనా తిన్నారా ?

జీవితంలో ఎంత కష్టమొచ్చినా ఒక రెండు ప్లేసెస్ కి మాత్రం పోకూడదని అంటుంటారు. అందులో ఒకటి ఆసుపత్రి అయితే, మరొకటి జైలు. ఆసుపత్రి సంగతి పక్కన పెడితే, జైలులో భోజనం చేసేందుకు జనాలు క్యూలు కడుతున్నారు. జైలులో భోజనం ఏంటీ .. దాని కోసం పోటీపడీ మరీ ఎదురు చూడడం దేనికీ అనుకుంటున్నారా.. అవును.. నిజమే. కానీ అది పోలీసులు తీసుకెళ్లి, శిక్షలు వేసే జైలు కాదు. ఆహ్లాదాన్ని పంచి, కడుపు నింపే జైలు. దీని గురించి తెలుసుకోవాలంటే ఛలో... నిజామాబాద్ అని పిలుపునిస్తున్నారు భోజన ప్రియులు.

ఇప్పుడున్న జనరేషన్ లో ఏ మాత్రం కాస్త విరామం దొరికినా.. లైఫ్ ను ఎంజాయ్ చేద్దాం అని ఆలోచిస్తున్నారు నేటి యువత. వీకెండ్ వచ్చినా, ఫ్రెండ్స్ తో అలా సరదాగా కూర్చొని గడపాలన్నా, ఫ్యామిలీని ఒక చోట చేర్చి కబుర్లు చెప్పుకోవాలన్న  గుర్తొచ్చేది రెస్టారెంట్. ఆ ప్లేస్ అయితేనే.. కాస్త ఒక దగ్గర కూర్చోవడానికి, గడపడానికి సమయం దొరుకుతుందని చాలా మంది భావిస్తారు. అలాంటి వారి కోసం నిజామాబాద్ లో ప్రిజన్  జైలు మండి రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఇన్ని రోజులూ ఫుడ్ లో వెరైటీలు చూసే పబ్లిక్, ఇప్పుడు హోటల్ డెకరేషన్, డిజైన్ చూసి కూడా వెళ్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. 

ఇక ఈ జైలు రెస్టారెంట్ లో విశేషాల గురించి చెప్పాలంటే హోటల్లోకి అడుగు పెట్టగానే పోలీసు అధికారి, ఖైదీ రూపంలో బొమ్మలు ఉంటాయి. ఇవి విజిటర్స్ కి వెల్ కమ్ చెప్పడం, లోపలికి వెళ్లగానే ఫుడ్ సర్వ్ చేసే స్టాఫ్ సైతం ఖైదీ వేషాల్లో ఉండాల్లో ఉండి భోజనం అందించడం చూడవచ్చు. వీటికితోడు జైలు వాతావరణాన్ని తలపించేలా అక్కడక్కడా తుపాకీలను ఏర్పాటుచేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ తరహా రెస్టారెంట్లు హైదరాబాద్ లో ఓపెన్ అయ్యి పాపులర్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా నిజామాబాద్ లోనూ ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

ఎవ్రీవన్స్ వాచింగ్ లిస్ట్ లో RRR

కాఫీ ప్యాకెట్లలో కొకైన్