ఎవ్రీవన్స్ వాచింగ్ లిస్ట్ లో RRR

ఎవ్రీవన్స్ వాచింగ్ లిస్ట్ లో RRR

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన మరో అద్భుతం ఆర్ఆర్ఆర్... ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో, ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో మర్చిపోకముందే తాజాగా ఈ మూవీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా... ఇటీవలే ఓటీటీలోనూ విడుదలైంది. కాగా ఎవ్రీవన్స్ వాచింగ్ సెలక్షన్ లిస్ట్ లో ఈ మూవీ ట్రెండింగ్ లో నిలిచిందని నెట్ ఫ్లిక్స్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. 

 

ఇకపోతే సీతారామరాజు- కొమురం భీమ్ పాత్రల్లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ మూవీకి కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల పరంగా కూడా విజయ దుందుభి మోగించింది.  కాగా ఇప్పటికే జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో విడుదలై సందడి చేస్తోంది.