‘ఏజెంట్’ నుంచి మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేసిన మేకర్స్

‘ఏజెంట్’ నుంచి మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేసిన మేకర్స్

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌ను శుక్రవారం పరిచయం చేశారు మేకర్స్. బాలీవుడ్‌‌లో నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌‌‌‌గా మంచి పేరు తెచ్చుకున్న డినో మోరియో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటిస్తూ.. తన క్యారెక్టర్‌‌‌‌తో పాటు ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేశారు. ‘ది గాడ్’ అంటూ చేతిలో మెషిన్ గన్‌‌తో పోస్టర్‌‌లో పవర్ ఫుల్‌‌గా కనిపిస్తున్నాడు డినో.  

పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం , ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీగా ప్రజెంట్ చేస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత అఖిల్ సినిమాతో టాలీవుడ్  ఎంట్రీ ఇస్తున్న డినో మోరియో  ఏ రేంజ్‌‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. ఏకే ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్స్‌‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ  రాశాడు.  హిప్‌‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు,  తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది.