- జూలపల్లి తహసీల్ ఆఫీస్ ఎదుట మాల సంఘం ధర్నా
పెద్దపల్లి/జూలపల్లి, వెలుగు: దళితునిపై దాడి చేసిన ఉపసర్పంచ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మాల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి తహసీల్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పాటకుల మహేశ్ మాట్లాడుతూ 15 రోజుల కింద జూలపల్లి జీపీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అనంతుల లచ్చయ్యను గ్రామ ఉప సర్పంచ్ కొప్పుల మహేశ్ కులం పేరుతో దూషించి దాడి చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లేటుగా కేసు నమోదు చేశారన్నారు.
అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తుండడంతో నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించారు. పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. లీడర్లు సూర ప్రభుదాస్, జ్యోతిబాస్, అనిల్, వీరయ్య, మల్లేశం, శంకరయ్య, కృష్ణ, తేజ, శ్రీధర్, నర్సయ్య, సంపత్ పాల్గొన్నారు
