
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే చాలా రియాలిటీ షోలు వచ్చాయి. నటి, మోడల్, డాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ షోతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ షోలో మలైకా హోస్ట్. షోకి వచ్చిన గెస్ట్‌ల లైఫ్ ఎక్స్‌పీరియెన్స్‌తోపాటు మలైకా లైఫ్ ఎక్స్‌పీరియెన్స్, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు.
ప్రస్తుతం ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఇందులో మలైకా తనను తాను పరిచయం చేసుకుంది. తర్వాత ఈ షో ఎందుకు చేస్తుందో చెప్పింది. నేహా ధుపియా, కరీనా కపూర్, అర్జున్ కపూర్ లాంటి ప్రముఖులు షోకు సపోర్ట్‌గా చేసిన మోనోలాగ్‌లో ఆమె గురించి మాట్లాడారు. తర్వాత బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ షోకి వచ్చింది. తర్వాత షో ఒక ఇంటర్వ్యూలా ఉంది. మలైకా ఈ ఏడాది మొదట్లో ఎదుర్కొన్న ప్రమాదంతోపాటు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పింది.