మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల రక్షణ, భద్రత కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం, మల్కాజ్‌గిరి సీపీ సుమతి మీ సురక్షఅనే ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ... కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 40 లక్షల జనాభా ఉందని తెలిపారు. అయితే నేరపూరిత ఆలోచనలు ఉన్న కొందరు వ్యక్తులు పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని, అలాంటి వారిపై గట్టి నిఘా పెట్టేందుకే ఈ మీ సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రజల సౌకర్యార్థం రెండు గూగుల్ లింకులను అందుబాటులో ఉంచుతున్నామని సీపీ తెలిపారు. ఇళ్ల యజమానులు తమ ఇళ్లలో అద్దెకు ఉండే వారి వివరాలను డొమెస్టిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఇళ్లలో పని చేసే వారు దేనికోసం పని చేస్తున్నారు అనే పూర్తి వివరాలను అందులో నమోదు చేయాలని కోరారు.
కేవలం ఇళ్లలోనే కాకుండా... 70 సంవత్సరాలు పైబడిన వృద్ధుల భద్రత కోసం కూడా ప్రత్యేక వెరిఫికేషన్‌ను ముందుకు తీసుకొచ్చినట్లు ఆమె వెల్లడించారు. మే 17 నుంచి సిటీలో ఈ మీ సురక్ష స్పెషల్ డ్రైవ్ ప్రారంభం కానుంది. మొత్తం 20 రోజుల పాటు సాగే ఈ డ్రైవ్‌ను కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని పోలీసులకు సహకరించాలని సీపీ సుమతి విజ్ఞప్తి చేశారు.
