మీ సురక్షపై సీపీ అవగాహన.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సంప్రదించాలి.

మీ సురక్షపై సీపీ అవగాహన.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సంప్రదించాలి.

నేరెడ్​మెట్​, వెలుగు : మీ సురక్ష యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పోలీసులను వేగంగా సంప్రదించవచ్చని మల్కాజిగిరి సీపీ బి. సుమతి అన్నారు. బుధవారం నేరెడ్​మెంట్​పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్​లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీ సుమతి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ సందీప్ కుమార్ పాల్గొన్నారు.