V6 News

మే 14న ఎంట్రన్స్ టెస్ట్..  రూ. 10 కోట్ల స్కాలర్షిప్ లు

మే 14న ఎంట్రన్స్ టెస్ట్..  రూ. 10 కోట్ల స్కాలర్షిప్ లు

మేడ్చల్, వెలుగు: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2026 – -27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోసం మే 14న ఎంఆర్జేఈఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వర్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి తెలిపారు. బుధవారం ఈ పరీక్ష పోస్టర్​ను వారు ఆవిష్కరించారు. 

ఈ ఏడాది ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి సుమారు రూ. 10 కోట్ల విలువైన స్కాలర్​షిప్ పథకాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. విద్యార్థుల నాలెడ్జ్, స్కిల్స్ ఆధారంగానే స్కాలర్​షిప్​లు మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్​సైట్ www.mallareddyuniversity.ac.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.