కర్నాటకనుంచి రాజ్యసభకు ఖర్గే నామినేషన్‌‌‌‌

కర్నాటకనుంచి రాజ్యసభకు ఖర్గే నామినేషన్‌‌‌‌

బెంగళూరు: ఏఐసీసీ ప్రెసిడెంట్‌‌ మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం కర్నాటక నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు. బెంగళూరులోని విధానసౌధ కాంప్లెక్స్‌‌లోని రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌ కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షికి నామినేషన్ పత్రాలను అందజేశారు. 

ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే పదవీకాలం జూన్ 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు. కర్నాటక నుంచే కాంగ్రెస్ తరపున మన్సూర్ అలీ ఖాన్, పవన్ ఖేరా కూడా పోటీ పడుతున్నారు. నామినేషన్​ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు  కె.సి. వేణుగోపాల్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.