న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నాయని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. సీఎం రేవంత్ సోదరులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు.
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ తన సోదరుడి కంపెనీకి భూ కేటాయింపుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని అర్హతలను పరిశీలించిన తర్వాతే నిబంధనల ప్రకారం కేటాయింపులు జరిగాయన్నారు.
