ఉమ్మడి నల్గొండలో 2.81 లక్షల ఓట్లు లేనట్టే...

ఉమ్మడి నల్గొండలో 2.81 లక్షల ఓట్లు లేనట్టే...
  • ఏఎస్​డీ కింద 24,460 ఓట్లు.. ‘సర్​’ డిజిటైజేషన్​ 90.6 శాతం

యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గొండలో 2,81,558 ఓట్లు లేనట్టేనని తెలుస్తోంది. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను మ్యాపింగ్​చేశారు. 2025 ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి నల్గొండలోని మూడు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29,84,448 మంది ఓటర్లున్నారు. 

యాదాద్రి జిల్లాలో 94.32 శాతం ఫారాలు డిజిటైజేషన్​ చేశారు. ఓవరాల్​గా ఉమ్మడి జిల్లాలో 90.6 శాతం ఫారాలను డిజిటలైజేషన్​ చేశామని ఎన్నికల సంఘం లెక్కలు విడుదల చేసింది. 

2 లక్షల 81వేల 558 ఓట్లు లేనట్టే

ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్​ ఫారాలను తిరిగి తీసుకోవడంలో కొందరు బీఎల్​ఓల నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో చేరలేదు. 24,460 ఓటర్లను ఆబ్సెంట్, షిప్టెడ్​, డెత్​ (ఏఎస్​డీ) కేటగిరి కింద పరిగణించిన ఎన్నికల కమిషన్​ వాటిని తొలగిస్తుంది. ఎన్యూమరేటర్ల వద్దకు 2,56,598 ఫారాలు  రాలేదు.

దీంతో మొత్తం 2,81,558 ఓట్లు ఈ నెల 17న ఎన్నికల సంఘం రిలీజ్​  చేసే డ్రాప్ట్​ ఓటర్​ లిస్ట్​లో ఉండవు. వచ్చే నెల 15 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్​ 15 వరకూ వాటిని పరిశీలించి అదే నెల 19న ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ పబ్లిష్​  చేస్తారు. 


ఉమ్మడి నల్గొండ​ జిల్లాలో జిల్లాల వారీగా ఫారాల​ వివరాలు

        జిల్లా    ఓటర్లు    డిజిటలైజేషన్    ఏఎస్​డీ    రాని ఫారాలు

  • యాదాద్రి    4,59,943    4,33,824    3,440    22,679
  • నల్గొండ    15,16,253    13,57,618    11,702    1,46,933
  • నూర్యాపేట    10,08,252    9,11,948    9,318    86,986
  • మొత్తం    29,84,448    27,03,390    24,460    2,56,598


వనపర్తి జిల్లాలో సర్​ 86 శాతమే

వనపర్తి  : వనపర్తి జిల్లాలో పూర్తి స్థాయిలో ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గమున్నా ఓటర్ల ఎన్యుమరేషన్​ నూరు శాతం పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. వనపర్తి సెగ్మెంటులో మొత్తం 2,75,570 ఓటర్లుండగా ఎన్యుమరేషన్​ పూర్తయ్యింది మాత్రం 2,36,978 మందివే. మొత్తం 86 శాతం మాత్రమే చేయగలిగారు. వనపర్తి పట్టణంలో 72.76, పెబ్బేరు పట్టణంలో 84.60శాతం పూర్తయ్యింది. 

గద్వాల జిల్లాలో 87.31 శాతం 

గద్వాల : ‘సర్’​ డిజిటైజేషన్​లో ఉమ్మడి జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ తెలిపారు. జిల్లాలో 63,925 ఆన్ కరెక్ట్ బుల్ ఫార్మ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల17న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. 17నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.


ఉమ్మడి మహబూబ్​నగర్    జిల్లాలో జిల్లాల వారీగా ఫారాల​ వివరాలు

         జిల్లా        ఓటర్లు    డిజిటలైజేషన్    ఏఎస్​డీ    రాని ఫారాలు

  • మహబూబ్​నగర్    7,32,488    6,29,402    5502    97,584
  • నాగర్​కర్నూలు    7,31,632    6,18,594    5844    1,07,194
  • వనపర్తి        2,75,570    2,37,006    1,612    36,952
  • గద్వాల        5,03,859    4,39,934    3,748    60,177
  • నారాయణపేట    4,95,574    4,19,214    9,109    67,251