గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. దీంతో మంగళవారం జూరాల ప్రాజెక్టు దగ్గర రెండు గేట్లను ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద 4.554 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకొని రెండు గేట్ల ద్వారా 8,040, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 41,511 క్యూసెక్కులతో కలిపి 54,447 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు కర్నాటకలోని ప్రాజెక్టుల నుంచి 50 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది.
