ఇక యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఏఐ కంటెంట్‌ను అరికట్టడానికి, యాక్టివ్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొత్త క్రియేటర్లు మానిటైజేషన్ కోసం గత 365 రోజుల్లో 8,000 వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.
మానిటైజేషన్‌కు సంబంధించి యూట్యూబ్ కొత్త రూల్స్ తెచ్చింది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఏఐ ద్వారా వచ్చే స్పామ్‌ను పూర్తిగా అరికట్టడానికి, యాక్టివ్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త క్రియేటర్ల కోసం యాడ్స్రెవెన్యూ షేరింగ్ అర్హత ప్రమాణాలు రెట్టింపు అయ్యాయి. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య ఇక నుంచి కూడా వెయ్యిగానే కొనసాగుతుంది.
కొత్త క్రియేటర్లు గత 365 రోజుల్లో 8,000 వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో రెండు కోట్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వీడియోస్వ్యూస్ సాధించాలి. ఇది వరకు నాలుగు వేల వాచ్అవర్స్ఉంటే సరిపోయేది. ఇప్పటికే మానిటైజేషన్ పొందిన క్రియేటర్లకు ఈ నిబంధనలు వర్తించవు. వీళ్లు 2027 జనవరి లోపు కొత్త నిబంధనలను అంగీకరించాలి. ఫ్యాన్ ఫండింగ్, షాపింగ్ షరతులు పాతవే కొనసాగుతాయని యూట్యూబ్ ప్రకటించింది.
మూడు నెలల్లో కోటి వ్యూస్
1. షార్ట్స్ క్రి యేటర్ల కోసం కొత్త మెయింటెనెన్స్ రూల్ తీసుకువచ్చారు. షార్ట్స్ ద్వారా యాడ్స్ రెవెన్యూ నిరంతరం పొందాలంటే క్రియేటర్లు ప్రతి 90 రోజులకు కోటి వ్యూస్ సాధించాలి. వ్యూస్ తగ్గితే షార్ట్స్ రాబడి తాత్కాలికంగా ఆగిపోతుంది. లాంగ్ ఫామ్ కంటెంట్ ద్వారా వచ్చే సంపాదన మాత్రం కొనసాగుతుంది. షార్ట్స్ వ్యూస్ మళ్లీ పెరిగినప్పుడు రెవెన్యూ ఆటోమేటిక్‌గా వస్తుంది.
2. క్రియేటర్లు కేవలం ప్రకటనల రెవెన్యూపైనే పూర్తిగా ఆధారపడకుండా ఉండటానికి యూట్యూబ్ కొత్త ప్రోగ్రామ్‌లను తీసుకురానుంది. షార్ట్స్ వ్యూస్ లక్ష్యాన్ని చేరుకోని చానెళ్ల కోసం ప్రత్యేక క్యాష్ ఇన్సెంటివ్‌లు అందిస్తారు. షాపింగ్ బోనస్‌లు, బ్రాండ్ డీల్ క్రెడిట్స్, ట్రెండ్స్ యాక్టివేషన్స్ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
3. ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను అన్ని దేశాలకు విస్తరిస్తున్నారు. దీని ద్వారా లాంగ్ ఫామ్ వీడియోలకు 55 శాతం, షార్ట్స్‌కు 45 శాతం రెవెన్యూ షేర్ క్రియేటర్లకు లభిస్తుంది. 2027లో వీళ్లకు మరింత
ఎక్కువ చెల్లిస్తామని యూట్యూబ్ప్రకటించింది.
4. క్రియేటర్లకు రివార్డ్ అందించే విధానాన్ని ఎలన్ మస్క్ ‘ఎక్స్’ కూడా మార్చింది. క్రియేటర్ పేఔట్ ప్రోగ్రామ్‌ను మార్చింది. ఒరిజినల్ కంటెంట్‌కు మాత్రమే రివార్డ్ అందించేలా గైడ్‌లైన్స్ మార్చింది. టిక్‌టాక్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పాపులర్ క్రియేటర్లను ఆకర్షించేందుకు ఫేస్‌బుక్ సైతం కొత్త మోనిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
5. ఈ మార్పుల వల్ల తమకు ఇబ్బందులు ఉండొచ్చని కొత్త క్రియేటర్లు అంటున్నారు. 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధించడం కొత్తవారికి కష్టతరం అవుతుందని చెబుతున్నారు. షార్ట్స్ క్రియేటర్లు ప్రతి 90 రోజులకు 10 మిలియన్ల వ్యూస్ రావడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.
