హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో రెస్ట్ రూంలో కానిస్టేబుల్ డెడ్ బాడీ

హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో రెస్ట్ రూంలో కానిస్టేబుల్ డెడ్ బాడీ

హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో సాయి కుమార్ అనే  కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన కలకలం రేపింది. సాయి కుమార్ ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో ఈ కాఫ్స్ రైటర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని నోట్ రాసినట్లు సమాచారం. పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తమకు సమాచారం అందించకుండా ఎందుకు డెడ్ బాడీ షిప్ట్ చేశారని పీఎస్ ముందు సాయికుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్‌రూమ్‌లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరివేసుకున్న ఘటన పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

సాయి కుమార్ 2024 బ్యాచ్‌లో సెలెక్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ను ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. సాయి కుమార్ను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం బండలేమురు గ్రామ రెవిన్యూ పరిధి అర్జున తండ స్వస్థలం.

ఒంటిపై రక్తపు గాయం ఉందని ఎవరో హత్య చేసి ఉంటారని కానిస్టేబుల్ కుటుంభ సభ్యులు ఆరోపించారు. ఉరి వేసుకుంటే బ్లడ్ ఎలా వస్తుందని ఏదో చేసి దాస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. హత్య చేసి ఉరి వేశారని ఆరోపించారు. ఏం చేయకపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఉస్మానియాకు ఎలా షిప్ట్ చేస్తారని అతని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.