సీనియర్లకు రేవంత్ వర్గం కౌంటర్

సీనియర్లకు రేవంత్ వర్గం కౌంటర్

కాంగ్రెస్ సీనియర్లకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గం రంగంలోకి దిగింది. కొత్త కమిటీల్లో టీడీపీ నుండి వచ్చిన 50 మందికి అవకాశం ఇచ్చారని వ్యాఖ్యలపై పార్టీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి స్పందించారు. టీడీపీ నుంచి వచ్చిన నేతల్లో ఎవరెవరికి కమిటీల్లో అవకాశమిచ్చారో తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. 

పీఏసీలోని 22 మంది సభ్యులో టీడీపీ నుంచి వచ్చిన వారిలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ లేరని మల్లు రవి స్పష్టం చేశారు. పీఈసీలోని  40 మంది సభ్యుల్లో టీడీపీకి చెందినవారు ఇద్దరు మాత్రమే ఉన్నారని అన్నారు. ఇక వీపీలోని 24 మందిలో టీడీపీ నుంచి వచ్చిన ఐదుగురికి చోటు దక్కగా,  జీఎస్ లోని 84 మందిలో ఐదుగురు మాత్రమే టీడీపీకి చెందిన వారిని మల్లురవి వివరించారు. ఇక డీసీసీకి చెందిన 26 మందిలో టీడీపీ నుంచి వచ్చినవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. కొత్తగా విడుదల చేసిన కమిటీల జాబితాలో SC, ST, BCల్లో మైనారిటీలు 68శాతం ఉండగా.. OCలు 32శాతం ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయం పాటిస్తోందని మల్లు రవి స్పష్టం చేశారు.