మాల్యా ఆస్తుల విలువ చెప్పరూ

మాల్యా ఆస్తుల విలువ చెప్పరూ
  • బ్రిటన్ ను కోరిన ఇండియన్ బ్యాంకులు

మనదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు 10 వేల కోట్ల రూపాయిల అప్పుల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నుంచి రుణాలు వసూలు చేయడానికి బ్యాంకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి . అయితే ఇతని ఆస్తుల యాజమాన్యం పై గందరగోళం నెలకొనడం తో బ్యాంకుల ప్రయత్నాలకు ఇబ్బంది కలుగుతోంది. ఇంగ్లండ్‌‌‌‌లో అతనికున్న ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలుపాలంటూ 13 ఇండియన్ బ్యాంక్‌‌‌‌లు లండన్ హై కోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశాయి. ఇంగ్లండ్‌‌‌‌లోని వేల్స్‌‌‌‌ మాల్యాకు చెందిన రూ.10,499 కోట్ల ఆస్తులను సీజ్ చేసుకోవచ్చని గతేడాది మేలోనే యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆస్తుల యాజమాన్యం విషయంలో ఎన్నో చిక్కు లు ఉండటం వల్ల నిందితుడి ఆస్తులను సీజ్ చేయలేకపోతున్నామని ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ అధికారు లు తెలిపారు. కొన్ని కార్లు, నగలు తప్ప తన వద్ద పెద్దగా ఆస్తులేమీ లేవంటూ మాల్యా వాదిస్తున్నాడు. టివిన్ ఎస్టేట్ తన సంతానం పేరిట ఉందని, లండన్‌‌‌‌ టౌన్ హౌజ్ తన తల్లిదని చెప్పా డు. కొన్ని లగ్జరీ యాచ్‌ లు కూడా ఇతరుల పేర్లపై ఉన్నాయి . మాబులా గేమ్‌ రిజర్వ్‌‌‌‌ వంటి మరికొన్ని ఆస్తులు బినామీ పేరిట ఉన్నాయని బ్యాంకుల కన్సార్ షియం భావిస్తోంది.ఇతడు అప్పులు తీసుకోవడానికి కొన్ని విదేశీ బ్యాంకుల్లో ఆస్తులను తనఖా పెట్టాడని, వాటి వివరాలు ఇవ్వాలని కూడా కోరాయి . ఇందుకు సానుకూలంగా స్పందించిన కోర్టు, ఇండియన్ బ్యాం క్స్ అడిగిన సమాచారం ఇవ్వాలని విదేశీ బ్యాం కులను ఆదేశించాయి. యాచ్‌ లను తనఖా పెట్టుకొని రుణాలు వచ్చామని బార్‌‌‌‌క్లేస్‌‌‌‌,ఖతర్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాం కులు తెలిపాయి. బోన్‌‌‌‌హామ్స్‌‌‌‌,ఆర్‌‌‌‌ఎం ఆక్షన్‌‌‌‌ సంస్థలు మాత్రం అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇవి కూడా వివరాలు ఇస్తే యూరప్‌ లోని మాల్యా ఆస్తుల గురించి తెలిసే అవకాశం ఉందని కన్సార్ షియం భావిస్తోంది.

కేసు విచారణ వాయిదా..

ఈ కేసు విచారణ కంటే ముందు, అంటే బుధవారం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో తన ఆస్తులను సీజ్ చేస్తున్న ఇండియన్ బ్యాంక్‌‌‌‌ల ప్రొసీడింగ్స్‌‌‌‌పై స్టే విధించాలని మాల్యా కూడా ఒక పిటిషన్ వేశాడు. ఇండియన్ బ్యాంక్‌‌‌‌లు తనపై దివాలా పిటిషన్ దాఖలు చేశాయనే, ఇంకా దాన్నే విచారించలేదని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ ‌‌‌ను ఈ ఏడాది చివరిలో విచారించే అవకాశముంది. మాల్యా అప్లికే షన్, ఇతర సాక్ష్యాధారాలు ఆలస్యం గా అందడంతో కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. తొలుత మాల్యా అప్లికే షన్‌‌‌‌ను విచారిస్తామని హైకోర్టు జడ్జి క్రిస్టోపర్ తెలిపారు. ఆ తర్వాత బ్యాంక్‌‌‌‌ల అప్లికే షన్‌‌‌‌ను విచారిస్తామని పేర్కొ న్నారు . కానీ ఇంకా దీనిపై విచారణ తేదీని ఖరారు చేయలేదన్నారు.