డైరెక్టర్ జోసెఫ్‌కు మమ్ముట్టి క్షమాపణలు

డైరెక్టర్ జోసెఫ్‌కు మమ్ముట్టి క్షమాపణలు

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి, డైరెక్టర్ జోసెఫ్ కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ పై చేసిన కామెంట్లు కొందరిని బాధించాయని, అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానన్నారు. అంతే కాదు ఇకపై ఇలాంటి ఘటలు పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఆయన ప్రశంసిస్తూ చేసిన కామెంట్లు.. కొందరికి నచ్చకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా బాడీ షేమింగ్ చేయడమేనంటూ కొందరు తీవ్ర విమర్శలు చేశారు. 

డైరెక్టర్ జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘2018’ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల మమ్ముట్టి లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ‘జోసెఫ్ తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు’ అంటూ మమ్ముట్టి ప్రశంసించారు. అయితే మమ్ముట్టి మాటలను కొందరు నెగెటివ్‌గా తీసుకున్నారు. జోసెఫ్‌ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారంటూ విమర్శించడం మొదలు పెట్టారు. దీంతో మమ్ముట్టి ఆయనకు క్షమాపణలు చెప్పడంతో పాటు.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని, గుర్తు చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.