
- రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో దారుణం
ఎల్బీనగర్, వెలుగు: రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నష్టాలు రావడంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి బీర్ బాటిల్ గొంతులో గుచ్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన పుచ్చకాయల సతీశ్ రెడ్డి(42) స్థానికంగా రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు.
వ్యాపారంలో రూ.కోటి వరకు డబ్బు పెట్టి నష్టపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. మనస్తాపంతో హయత్ నగర్లోని డిఫెన్స్ కాలనీలో ఒక్కడే బీర్ తాగిన తర్వాత బాటిల్ పగలగొట్టి గొంతులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని అతని స్నేహితులు, స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.