బ్రదర్స్​ అంటే మీలా ఉండాలి

బ్రదర్స్​ అంటే మీలా ఉండాలి

ఒక ఇంట్లో పుట్టిన పిల్లలంతా ఒకేలా ఉండాలని లేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనీ లేదు. ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకని కొన్ని విషయాల్లో వాళ్లని దూరం పెట్టినా, ‘నువ్వు చేయలేవు’ అని చెప్పినా వాళ్లు బాధపడతారు. అదే వాళ్లని కూడా కలుపుకుని పోతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక్కడున్న ఇద్దరు అన్నదమ్ములు అలాంటివాళ్లే. వాళ్లలో ఒకరికి కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవడమే కష్టమైన తనకు ఎత్తైన ప్రదేశాల్లో నడవడం కలలోనే జరుగుతుంది. కానీ, తోడుగా అన్న ఉంటే ఏదైనా చేయగలడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ట్రావెల్ అడ్వెంచర్​ అని ఎడారి ప్రాంతానికి వెళ్లారు. తమ్ముడు నడవలేడు కదా.. ఎడారి ఇసుకలో పరుగెత్తుకుంటూ పైకి వెళ్లడం ఎలా? అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తమ్ముడిని తన భుజాల మీద వేసుకుని ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి, పైన కూర్చోబెట్టాడు. ఆ వెంటనే ఒక సెల్ఫీ కూడా దిగారు. ఇదంతా వీడియో తీశారు తోటి ఫ్రెండ్స్. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తూ ‘ట్రావెల్ బడ్డీస్​ ఫర్ లైఫ్​’ అనే క్యాప్షన్ పెట్టారు. అది చూసిన నెటిజన్స్ ‘బ్రదర్స్​ అంటే మీలా ఉండాలి” అంటూ మెచ్చుకున్నారు.