కారు దిగుతరా.. లేరా?: రన్నింగ్ వెహికల్ను ఆపి యువకుడి వీరంగం

కారు దిగుతరా.. లేరా?:  రన్నింగ్ వెహికల్ను ఆపి యువకుడి వీరంగం

కూకట్​పల్లి, వెలుగు:  సిటీలో రాత్రి పూట ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బండ్లను ఆపుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఉప్పల్​లో క్యాబ్​లో వెళ్తున్న ఐటీ ఉద్యోగులతో యువకులు తప్పతాగి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన జరిగి వారం గడవకముందే తాజాగా కూకట్​పల్లిలో మరో ఘటన జరిగింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెద్దగోగాడ గ్రామానికి చెందిన సింహాచలం  మూసాపేటలో ఉంటున్నాడు. గంజాయి మత్తులో  ఓ కారును ఆపి వీరంగం సృష్టించాడు. 

మంగళవారం రాత్రి అమీర్​పేట నుంచి కూకట్​పల్లి వైపు వెళ్తున్న కారును ఆపి బానెట్​పైకి ఎక్కాడు. కారులో ఉన్న వారిని కిందికి దిగాలని బెదిరించాడు. వారు పక్కకు తప్పుకోవాలని బతిమిలాడినా వినలేదు. కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు బలవంతంగా కిందకు దించి కారుని పంపించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.