ఘట్కేసర్, వెలుగు: లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ఓ కేటుగాడు.. పానీపూరి వ్యాపారి ఫోన్ ఎత్తుకెళ్లి, బ్యాంకు ఖాతాలోని నగదును కాజేశాడు. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నోజిగూడ వద్ద పానీపూరి వ్యాపారం చేసుకునే దేసెట్టి రాజు వద్దకు గతేడాది డిసెంబరులో ఓ వ్యక్తి వచ్చాడు. తాను పేటీఎం ఏజెంట్నని పరిచయం చేసుకుని లోన్ చెక్ చేస్తానంటూ బాధితుడి మొబైల్ తీసుకున్నాడు.
రాజు వ్యాపారంలో బిజీగా ఉండటంతో ఫోన్తీసుకొని పరారర్యాడు. ఆపై యూపీఐ ద్వారా రాజు ఖాతా నుంచి రూ.54 వేలను తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

