హైదరాబాద్ కూకట్ పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్... వ్యక్తి దారుణ హత్య..

హైదరాబాద్ కూకట్ పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్... వ్యక్తి దారుణ హత్య..

హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది.. ఓ గ్యాంగ్ గంజాయి మత్తులో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం ( మే 11 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి... కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ సమీపంలో ఉన్న పార్కులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు వెంకటరమణ అనే యువకుడిని ఐరన్ రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్డుతో గుండెల్లో గుచ్చగా తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

నిందితులు పార్కులో గంజాయి సేవిస్తుండగా..  అపార్టుమెంట్ వాచ్మెన్‌తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీయగా... ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

►ALSO READ | సిద్దిపేట జిల్లాలో వాహన తనిఖీలు .. 66 డ్రంకన్ ​డ్రైవ్ ​కేసులు నమోదు

స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 
ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హత్యకు కారణం గంజాయి మత్తేనా లేక అక్రమ సంబంధమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు..